12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం

07-08-2025 12:29 AM

తంగళ్ళపల్లి ఆగస్టు 06(విజయక్రాంతి); అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్ర క్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. తంగళ్లపల్లి మండలం బద్దెనప ల్లి లోని ఎస్ ఎస్ గార్డెన్స్ లో నూతన రే షన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్, కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తంగళ్లపల్లి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు.

వీటి ద్వారా పేదలకు రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1397 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసి అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ , ఆధార్ కార్డు, కరెం ట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమా రేషన్ కార్డు ఉపయోగపడుతుందనికలెక్టర్ తెలిపారు.

ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డి డబ్ల్యు ఓ లక్ష్మీరాజ్యం తహసిల్దార్ జయంత్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.