07-08-2025 12:29:47 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.ఆగస్టు 6(విజయక్రాంతి):జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మం డలి సమావేశం.జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టి.జి. ఐపాస్ ద్వారాపరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుండి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువు లోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అ న్నారు.
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. పరిశ్ర మల స్థాపనకు 23 దరఖాస్తులు రాగా వాటి లో వివిధ శాఖల నుండి అనుమతి పొందిన 16 మంజూరు కు డిఐపిసి కమిటీ లో ఆమో దం తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎం భరత్ రెడ్డి, నర్సింగ్ రావు,జి. మేఘ గాంధీ ఆర్. టి. ఓ. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.