23-08-2025 12:23:56 AM
ఎమ్మెల్యే కోరం కనకయ్య
గార్ల, ఆగష్టు 22(విజయ క్రాంతి ):- గార్ల మండలం లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని,చిన్న బంజారా గ్రామపంచాయతీలోని కట్టుకుంట తండా లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా 12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాన్ని అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వర్తింప చేస్తాయని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంగన్వాడి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్,ఎంపీడీవో మంగమ్మ,తహసిల్దార్ శారద, సీఐ రవికుమార్,సిడిపిఓ లక్ష్మి, మాజీ ఎంపీపీ మాలోత్ వెంకట్ లాల్, మాజీ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి, గుండా వెంకట్ రెడ్డి, భూక్య నాగేశ్వరరావు, ధనియాకుల రామారావు, తాళ్లపల్లి కృష్ణ గౌడ్,హతీరామ్ నాయక్, మోతిలాల్ నాయక్, గుగులోతు ఉమాభద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.