23-08-2025 12:24:06 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న కరిశల గట్టం గ్రామంలో గల ఎంపిపిఎస్ పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్ లు పంపిణీ చేశారు.
సిరి ఫౌండేషన్ ఫౌండర్ కుశనపల్లి మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్ లు పంపిణీ చేశామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.