22 May, 2026 | 2:38 AM

పండించిన ప్రతి గింజ కొంటాం

22-05-2026 01:10 AM

నిర్మల్ మే 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చే స్తుందని రాష్ట్ర మాజీ మంత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. గురువారం ఆయన సారంగాపూర్ నిర్మల్ మండలంలోని కౌట్ల, సారంగాపూర్, జామ్ గ్రామాల్లో మరియు నిర్మల్ మార్కెట్ యాడ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట ఉత్పత్తులను పరిశీలించి, అక్కడి రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మా ట్లాడుతూ... రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి,Fscs చైర్మన్ ధర్మాజీ రాజేందర్,మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి,నాయకులు ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు Sp రాజు, శెనిగారపు నరేష్, లక్కాకుల హరీష్ తదితరులు పాల్గొన్నారు