22 May, 2026 | 2:39 AM

కేంద్రం ఇప్పటికైనా కండ్లు తెరవాలే..!

22-05-2026 01:11 AM
  1. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోదీ స్పందించాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో బీసీ కులా ల లెక్కలను సేకరించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం అభినందనీయమని, సుప్రీంకోర్టు తీర్పుతో నైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి బీసీ కులగలను ప్రక్రియను ఎప్పటికైనా ప్రారంభించారని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాం డ్ చేశారు. 

గురువారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో జాజు ల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులగనన చేపట్టి బీసీ కులాల వివరాలు అధికారికంగా వెల్లడించి బీసీ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం పెంచే వరకు దేశవ్యాప్తంగా తాము చేస్తున్న పోరాటం ఆగదని పూర్తిగా విజయం సాధించే వరకు కేంద్రంపై బీసీలు పోరాడుతూనే ఉంటారని తెలిపారు.

సుప్రీంకోర్టు కులగణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేటి వరకు ప్రధాని మోదీ స్పందించలేదని, కనీసం కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనైనా నిర్ణయం తీసుకుని కులగణన ప్రక్రియ ప్రారంభించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు బీసీల పక్షాన నిలబడినందుకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సూర్యకాంత్ త్రిసభ్య ధర్మాసనానికి బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు. 

బీసీ జేఏ సీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ప్రొఫెసర్ సంఘా న్ని మల్లేశ్వర్, కనకాల శ్యాం కుర్మా, దీటి మల్ల య్య, కౌలే జగన్నాథం, గూడూరు భాస్కర్ మేరు, గోధ వరుణ్ కుమార్ గౌడ్, సత్యరాజు గౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, మణికంఠ, శ్రావణి,  పాల్గొన్నారు.