calender_icon.png 6 August, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సర్వీస్ పాఠ్యప్రణాళికను సరళీకృతం చేస్తాం

28-07-2025 01:05:09 AM

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య పురుషోత్తం

ముషీరాబాద్, జూలై 27(విజయక్రాంతి): యూపిఎస్సీ  నిర్వహించే సివిల్ సర్వీస్‌లో కూడా తెలుగును ప్రత్యేకంగా తీ సుకొని సివిల్స్‌కు సెలెక్ట్ అయ్యే విధంగా పాఠ్యప్రణాళికను సిద్ధ పరిచి అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ఉన్న త విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. 

ఈ మేరకు ఆదివారం విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సా హిత్య అకాడమీ, తెలుగు భాషా చైతన్య స మితి, తెలుగు శాఖల సంయుక్త ఆధ్వర్యం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లావూరి విజయ సదస్సు సంచాలకులుగా ‘దాశరథి సినారెల సాహిత్య సమాలోచన‘ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య పురుషోత్తం, కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె. ప్రభు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగేశ్వరం శంకరం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం  మాట్లాడుతూ.... యూపీఎస్సీ వాళ్లు నిర్వహించే సివిల్ సర్వీస్ లో కూడా తెలుగును ప్రత్యేకంగా తీసుకొని సివిల్స్ కు సెలెక్ట్ అయ్యే విధంగా పాఠ్య ప్రణాళిక ను సిద్ధ పరిచి అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.