28-07-2025 01:06:25 AM
- కేసీఆర్ కుట్ర ఫలితమే ఆరు జిల్లాల ఏర్పాటు
- సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
హనుమకొండ / టౌన్, జూలై 27 (విజయ క్రాంతి): వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపేసి వరంగల్ జిల్లాను ఏ ర్పాటు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం హ నుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో చర్చావేదిక కార్యక్రమానికి కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడు తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారన్నారు. చారిత్రక వరంగల్, హనుమకొండ నగరాలను వేరుగా విభజించడం వలన ఆర్థికంగా వెనుకబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు జిల్లాలను ఒకటిగా చేసేందు కు రాజకీయ పార్టీలకు అతీతంగా మరోసారి ఉద్యమాలు నిర్వహించుటకు ప్రజాసంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రతిపాదనకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే వన్నా ల శ్రీరాములు, మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు, సీపీఐ, సీపీఎం నాయకులు చుక్క య్య, ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆబుబాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు నూనె అప్పారావులు ముక్తకంఠంతో మద్ద తు ఇచ్చారు. రెండు జిల్లాలు ఒకటిగా అయినప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కోరారు.
కార్యక్రమంలో చరిత్రకారుడు ప్రొఫెసర్ విజయబాబు, చిల్ల రాజేంద్ర్ర పసాద్, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ చింత ప్రవీ ణ్, గంటా రామ్రెడ్డి, పుల్లూరు సుధాకర్, చాపర్తి కుమార్, బొమ్మిలేని పాపిరెడ్డి, బాబురావు, సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, సోమిరెడ్డి శ్రీనివాస్, పాల్గొన్నారు.