28-07-2025 01:04:45 AM
-ఆనాడే కేసీఆర్ చెప్పారు
-బీఆర్‌ఎస్‌లో బీజేపీ విలీనం అవుతామన్నా ఒప్పుకోరు
-మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ భావజాలం వేరు, బీజేపీ భావజా లం వేరని, ప్రాణం పోయినా బీజేపీతో పొ త్తు ఉండదని కేసీఆర్ చెప్పారని మాజీ మం త్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నిక ల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారని, బీజేపీ తెలంగాణకు పనికి వచ్చే పార్టీ కాదన్నారు.
ఆదివా రం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రమేశ్ ఇంటికి మిత్రునిగా తాను, కేటీఆర్ వెళ్తే త ప్పేంటని, తమను భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని సీఎం రమేశ్ తమతో చెప్పారని అ న్నారు. కవిత జైలుకు వెళ్తే బెయిల్ ఇచ్చేది కోర్టు అయితే ఆమె విషయంలో బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఎలా చెప్తారని ఆ యన ప్రశ్నించారు. కంచెగచ్చిబౌలి భూ ము ల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పా రన్నా రు.
చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టుని సీఎం రమేశ్ చదివారని వి మర్శించారు. పథకం ప్రకారం బీజేపీ, చంద్రబాబు, రేవంత్‌లు కలిసి డ్రామాలు ఆడుతు న్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ అని, రాబోయే రోజుల్లో కేంద్రాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారని, బీజేపీ వచ్చి బీఆర్‌ఎస్‌లో విలీనం అవుతామన్న కేసీఆర్ ఒప్పుకోరన్నారు.
రేవంత్‌ను జైపాల్‌రెడ్డి ఇష్టపడలేదు
జైపాల్‌రెడ్డికి ఉన్న మంచి పేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయ త్నం చేస్తున్నారని, రేవంత్‌రెడ్డిని ఒక మనిషిలాగా చూడటానికి జైపాల్‌రెడ్డి ఇష్టపడ లేద ని, ఆయన్ని గొంగళిపురుగు కంటే హీనంగా చూశారన్నారు. రేవంత్ దుర్మార్గాలను బయటపెడుతున్నందుకు కేసీఆర్, కేటీఆర్‌లపై ఏ డుస్తున్నారని, అసెంబ్లీలో ఎవరిని సస్పెండ్ చేయలేదన్న సీఎం, తనను సెషన్ నుంచి స స్పెండ్ చేయలేదా అని ప్రశ్నించారు.
రేవంత్‌కు భయంతోనే మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని, ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోను వాడుతున్నారని ఆరోపించారు. సీఎం రమేశ్ ఎప్పుడూ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లలేదని, బీజేపీలో ఆయనకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.