03-12-2025 12:44:24 AM
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం నగరంలో విస్తృత పర్యటనలు చేశారు. హిమాయత్ నగర్, ఆదర్శనగర్ బస్తీల్లో పర్యటించి 30 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, తుది దశకు చేరుకున్న పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు.
హిమాయత్‌నగర్- ఆదర్శనగర్ బస్తీ వాసులు 30 ఏళ్లుగా మురుగు సమస్యతో నరకం చూ స్తున్నారు. మంగళవారం రంగనాథ్ స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వంద అడుగుల దూరంలో హుస్సేన్‌సాగర్ నాలా ఉన్నప్పటికీ వరద నీరు ఎందుకు వెళ్లడం లేదో ఆరా తీశారు.
6 మీటర్ల మేర దెబ్బతిన్న పైపులైన్లను మార్చడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పెద్ద పైపులు వేయాలని సూచించారు. పాతబస్తీలోని చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు మరో 15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోందని రంగనాథ్ వెల్లడించారు.