10 May, 2026 | 1:15 AM

ప్రజల మధ్య ఉండి పోరాడుతాం

10-05-2026 12:28 AM
  1. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తాం
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ప్రధాని మోదీ సభకు రాజకీయ ప్రాధాన్యత కచ్చితంగా ఉంటుందని, రాబోయే రెండున్నరేళ్ల పాటు ప్రజల మధ్యనే ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వుతో కలిసి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పై పోరాటం చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తెస్తామన్నారు. రూ.9,400 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజతోపాటు జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. మోదీ రాకకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెం టీలు, 420 సబ్ గ్యారెంటీలను అమలు చేయలేదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడి చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పూరి గా డబ్బుల మీద ఆధారపడి, రూ.వేల కోట్లు డబ్బులు వసూలు చేసుకుని, వచ్చే ఎన్నికల్లో డబ్బులతోనే గెలవాలని ఆలోచిస్తోందని వి మర్శించారు. రానున్న రెండున్నరేళ్లు తామం తా కష్టపడి, ప్రజల మధ్య ఉండి పోరాడి రా ష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత మోదీ తెలంగాణకు వస్తున్నారని, రానున్న రోజుల్లోనూ మోదీ రాష్ట్రానికి వస్తారన్నారు. జహిరాబాద్‌లో ఇండస్ట్రీయల్ పార్క్, వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్, హైదరాబా ద్‌కు పైప్‌లైన్ ద్వారా పెట్రోలి యం ఉత్పత్తులు, మహబూబ్‌నగర్, నల్లగొండలోని జాతీయ రహదారులు, రైల్వే నెట్ వర్క్ వంటి ప్రాజక్టులను ప్రారంభోత్సవ, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలిపారు. 

రాష్ట్రానికి మోదీ వస్తూనే ఉంటారు: రాంచందర్‌రావు

గతంలో కుటుంబ పాలన, అవినీతి పాల న సాగిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులు మాట తప్పుతున్నారని పేర్కొన్నారు. దేశంలో మార్పు మొదలైందని, తెలంగాణలో కూడా డబుల ఇంజిన్ సర్కార్ తీసుకొస్తే అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. తర్వాతి టార్గెట్ తెలంగాణ ఉండేలా మోదీ తమకు అంతర్గత సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తారన్నారు.

తెలంగాణ కు ఇప్పటికే రూ.13 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ట్రైబల్ వర్సిటీ, ఎయి మ్స్ వంటి మరిన్ని అభివృద్ధి పనులను ప్రా రంభించడానికి, జాతికి అంకితం చేయడానికి కూడా మరోసారి మోదీ రాష్ట్రానికి వస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.1.30 లక్ష కోట్ల మేర జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఇకపై తెలంగాణకు మోదీ వస్తూనే ఉంటారని ఆయన చెప్పారు.