29 June, 2026 | 10:03 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం

09-04-2025 02:09 AM

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : మున్సిపల్ కార్మికులకు అన్నివిధాలా అండగా ఉంటానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కార్మికులకు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖర్రాజు, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆయన కాస్మొటిక్ కిట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కాస్మోటిక్స్, పెండింగ్ జీతాలు,  ఇతర బిల్లులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. 14 ఏండ్ల తరువాత ఎమ్మెల్యే సూచనల మేరకు మున్సిపల్ కార్మికులకు కాస్మొటిక్ కిట్లు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.