calender_icon.png 8 May, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటాం

06-05-2025 12:00:00 AM

  1. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు 

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

రాయిలాపూర్లో పరిశీలించిన మైనంపల్లి హన్మంతరావు

మెదక్, మే 5(విజయక్రాంతి):అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అకాల వర్షం, ఈదురు గాలులతో పంట నష్టపోయిన రైతులను పంట నష్టపరిహారంతో పాటు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

తడిసిన ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని, రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు.

అంతే కాకుండా ప్రభుత్వం నుండి రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందాల్సిన ప్రతి యొక్క రైతుకు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటాననిస్పష్టంచేశారు.

కాగా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ రాష్ట్ర నేత మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు పరిశీలించారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు.