calender_icon.png 7 May, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి

06-05-2025 12:00:00 AM

గుర్రాల సోఫా వద్ద రైతుల ధర్నా రాస్తారోకో

దౌల్తాబాద్, మే 5: రాయపోల్ మండలంలోని రామా రo, సయ్యద్ నగర్, దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయం త్రం కురిసిన భారీ వడగండ్ల వా నతో కోతకు వచ్చిన వరి పంట రాళ్ల వర్షంతో పూర్తిగా నేల రాలడంతో రైతులు సోమవారం గజ్వేల్-చేగుంట రహదారి పై గుర్రాల సోఫా వద్ద రైతులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈదురు గాలులు, వడగండ్ల వానతో తాము వేసిన పంట పూర్తిగా నేలరాలినప్పటికీ అధికారులు ఇటువైపు తొంగి చూడకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరుగాలం తాము కష్టపడి పండించిన పంట కళ్ళముందే రాళ్ల వర్షాలకు నేలరాలడంతో రైతుల ఆందోళన చెందుతూ తమకు పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రాయపోల్, దౌల్తాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నాను విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంబంధిత అధికారులను అక్కడికి రప్పించి రైతులతో మాట్లాడారు.

వ్యవసాయ శాఖ అధికారి నరేష్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాను, దౌల్తాబాద్ ఎస్త్స్ర ప్రేమ్ దీప్ లు కలసి రైతులను సముదాయించారు. ఏఓ నరేష్ మాట్లాడుతూ వడగండ్ల వానకు నష్టపోయిన పంట వివరాలను సేకరించి నివేదికను పైఅధికారులకు అందజేసి, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తామన్నారు.

దీంతో రైతులు ధర్నాను విరమించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామంలోకి వెళ్లి పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు  పాల్గొన్నారు.