18 April, 2026 | 9:59 PM

Breaking News

సహకార సంఘాల బలోపేతానికి తోడ్పాటు అందిస్తాం

21-06-2025 12:00 AM

నాబార్డ్ డీడీ ఎం.వీరభద్రుడు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జూన్20 (విజయ క్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతా నికి తోడ్పాటును అందిస్తామని నాబార్డ్ డీడీ ఎం.వీరభద్రుడు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పిఎసిఎస్ లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో ఆపరేటివ్ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశానికి సహకార అధికారి బిక్కు నాయక్‌తో కలిసి హాజర య్యారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రపంచ బ్యాంకు అందజేస్తున్న రాయితీలను సహకార సంఘం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమానికి , వ్యవసాయ అభివృద్ధికి నాబార్డ్ ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటుందన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మ ద్, వైస్ చైర్మన్ రూపం ప్రహ్లాద్ ,డిసిసిబి బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్, సీఈవో వెంకట రమణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.