18 April, 2026 | 11:36 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

380 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

20-06-2025 11:00 PM

మునిపల్లి: కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 380 గ్రాముల ఎండు గంజాయిని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Excise and Enforcement Officers) శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, ఏ ఈ ఎస్ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీదర్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయిని సరపర చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి మునిపల్లి మండలం కమకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.

ఈ తనిఖీలో భాగంగా ఓ ఆటోపై అనుమానం రావడంతో ఆపి తనిఖీ చేశాయగా అందులో ఉన్న 380 గ్రాముల ఎండు గంజాయి పట్టుకొని సీజ్ చేశారు. ఎండు గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు హైదరాబాదులోని జీడిమెట్లకు చెందిన ప్రతి ఎల్లి అనే వ్యక్తి బీదర్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాదులో అధిక ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీమ్, కానిస్టేబుల్ కరిమ మల్కయ్య, యాదయ్య, రామారావు తదితరులు ఉన్నారు.