calender_icon.png 21 June, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

20-06-2025 11:07:09 PM

మోతె: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్(District Medical Health Officer Dr. Chandrasekhar) సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, అలాగే సిబ్బంది హాజరును పరిశీలించారు. మందుల నిల్వలు, పారిశుధ్యం వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. ఈ తనిఖీలో భాగంగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. వారి వెంట జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటిరత్నం, మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేష్, పిహెచ్ఎన్ జయలక్ష్మి, తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.