calender_icon.png 21 January, 2026 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాల నివారణపై అవగాహన

21-01-2026 12:00:00 AM

కలెక్టరేట్‌లో గాలిపటాలు ఎగురవేసిన మంత్రి జూపల్లి

నిర్మల్, జనవరి 21( విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అరైవ్ ఆన్లైన్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం గాలిపటాలు ఎగురవేశారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి గాలిపటాలు ఎగురవేసిన జూపల్లి ప్రమాద రైతు సమాజాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి సాయికిరణ్ అధికారులు ఉన్నారు.