20-05-2024 01:19:13 AM
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బస్తీ పక్కన పరిశ్రమలు తొలగించేలా కృషి చేస్తా
మహేశ్వరం, మే 19: బస్తీలల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో మిథాలనగర్, విజయపూరి కాలనీ, జై భావానీనగర్ బస్తీ ల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పర్యటించా రు. మిథాలనగర్ బస్తీలో వర్షం పడిన తరువాత వరదనీరు సజావుగా డ్రైనేజీల్లోకి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో బస్తీ జలమయంగా మారుతుందని స్థానికులు తెలి పారు.
అంతేకాకుండా పక్కనే ఉన్న సత్యసాయినగర్ బస్తీ రోడ్డు ఎత్తులో ఉండటంతో మిథాలనగర్ వరదనీరు పోవడానికి వీలు లేకపోవడం కూడా ఓ కారణమని బస్తీవాసు లు పేర్కొన్నారు. వారి సమస్యలను విన్న ఆమె వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. స్థానికులకు కలుగుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విజయపూరి కాలనీ ప్రజలు బస్తీలో నుంచి మురుగునీరు, వదరనీరు ముందుకు పోవడానికి మార్గం లేదని, అందువల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామ ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
అయితే బస్తీ పక్కనే ఉన్న ఎఫ్‌టీఎల్ ఒపెన్ ల్యాండ్ మీదు గా వీలుంటే పైపులైన్లు వేసి ప్రస్తుతం సమస్యను పరిష్కరించే అవకాశం ఉందో లేదో చూడాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా బస్తీ పక్కనే కొనసాగుతున్న పరిశ్రమలను తొలగించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జై భవానీనగర్ కాలనీలో సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని స్థాని కులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మీర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, బడంగ్‌పేట్ అధ్యక్షుడు రాంరెడ్డి, డిప్యూ టీ మేయర్ ఇబ్రహిం శేఖర్, నర్సింహరెడ్డి, బస్తీవాసులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
నిరుపేదలకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సబితా ఇం ద్రారెడ్డి సూచించారు. ఆదివారం బాలాపూ ర్ చౌరాస్తాలో కొత్తగా ఏర్పాటైన లక్ష్మీకావ్య దవాఖానను ఆమె ప్రారంభించారు. వైద్యు డు దేవుడితో సమానం అన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని ఆమె పేర్కోన్నారు.