calender_icon.png 29 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం

29-09-2025 12:04:55 AM

చిలుకూరు, సెప్టెంబర్ 28 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని స్థానిక దొడ్డ నరసయ్య, భవనంలో తాళ్లూరి  పెద్ద మల్లయ్య అధ్యక్షతన జరిగిన మండల కౌషల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అయినటువంటి రిజర్వేషన్లు గ్రామాలలో పార్టీ బలబలాలు, పోటీ చేసే స్థానాలు వీటన్నిటిపై గ్రామ గ్రామాన పార్టీ నాయకత్వంలో కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత రాష్ట్ర, జిల్లా నాయకుల సూచనల మేరకు కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తులు అవగాహన చేసుకుని కలిసి వచ్చే పార్టీల మద్దతుతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి మండల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. 

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి షేక్ సాహెబల్లి, కాంపాటి వెంకటయ్య, కొండ కోటయ్య, పిల్లుట్ల కనకయ్య, చేపూరి కొండలు, రెమిడాల రాజు, దొడ్డ వెంకటయ్య, దొడ్డ నాగేశ్వరరావు పాల్గొన్నారు.