29-09-2025 12:05:23 AM
వరంగల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్ర మహోత్సవాలలో ఏడవ రోజు భవాని మాతగా అలంకరించిన భద్రకాళి అమ్మవారిని ఆదివారం సాయంకాలం దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవాలయ చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరు మయూరి,
గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, మూగ శ్రీనివాసరావు, ఈవో రామల సునీత అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మంత్రి కొండా సురేఖకు అర్చకులు వేద పండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాలు బహూకరించి ప్రసాదములు అందజేశారు. అనంతరం దేవాలయంలో నిర్వహింపబడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులను మంత్రి అభినందించారు.