calender_icon.png 11 October, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తా

11-10-2025 06:00:02 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో తనను గెలిపిస్తే సంఘం అభివృద్ధికి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవరకోట మాజీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలో ఆర్యవైశ్యులను కలిసి అభివృద్ధి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి ఈనెల 18న జరిగే ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. నిర్మల్ లో ఫంక్షన్ హాల్ సంఘం అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కృషి సీనియర్ నేతలకు గౌరవ సన్మానం తదితర అంశాలతో ముందుకు పోతున్నట్టు తెలిపారు.