11-10-2025 05:58:56 PM
పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి పటాన చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శనివారం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.