11-10-2025 06:03:46 PM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో నియోజకవర్గస్థాయి బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్దంగా పోకుండా కేవలం బీసీలను మభ్య పెట్టేందుకు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. హైకోర్టులో కేసులు వేయించిందని ఆరోపించారు. ఆచరణకు సాధ్యం కాకుండా ఉన్న రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బీసీలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ నాటకం మాడిందన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ కుంట లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, మోహన్ రెడ్డి, విపుల్, తదితరులు పాల్గొన్నారు.