16-12-2024 06:41:22 PM
ఎమ్మెల్యే గాంధీ...
కూకట్ పల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. సోమవారం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్, జలవాయి విహార్, భాగ్యనగర్ కాలనీలో సుమారు 64 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీలో దశలవారీగా అభివృద్ధి పనులను ప్రారంభించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు ఆయా కాలనీవాసులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.