18 July, 2026 | 3:07 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

క్రైమ్ థ్రిల్లర్‌గా వీకెండ్

29-11-2024 12:00 AM

వీఐపీశ్రీ హీరోగా, ప్రియా దేషపాగ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘వీకెండ్’. బీ రాము రచనా దర్శకత్వంలో ఖడ్గధార మూవీస్ బ్యానర్‌పై ఐడీ భారతి నిర్మిస్తున్నారు. పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల చీరాలలో మొదలైంది. ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ లేళ జయ, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ అంతా చీరాలలోనే జరగనుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. అజయ్, ఎస్తర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డెబోర, సునీత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఈశ్వర్, నిఖిత; డీవోపీ: యూఎస్ విజయ్; సంగీతం: ఎన్ అర్జున్.