అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మంత్రి జూపల్లి కృష్ణారావు
చిన్నంబావి, .ఏప్రిల్ 1: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. మండలంలోని చిన్నదగడ,అమ్మాయి పల్లి గ్రామాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామ సర్పంచ్ కవిత శాలువ కప్పి మంత్రి కి ఆహ్వానంపలికారు.
గ్రామంలోని సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు లబ్ధిదారుల ఎం పిక అంశాలపై స్థానిక అధికారులు ప్రజలతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలోని నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నాణ్యతల్లో ఎలా ఉంది రాజీ పడవద్దు అని అధికారులకు సూచించారు.సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని అధికారులు నిర్దేశం చేశారు.మండలానికి మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, చిన్నదగడ, అమ్మాయి పల్లి గ్రామాల సర్పంచులు గంగాధర్ యాదవ్,కవిత,పార్టీ సీని యర్ నాయకులు రామచంద్రారెడ్డి, చిదంబర్ రెడ్డి, బిచుపల్లి యాదవ్, వివిధ శాఖల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




