వీరభద్ర స్వామిని దర్శించుకున్న సీఐ అంజలి
02-04-2026 12:46 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ రూరల్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన సీఐ అంజలి బుధవారం కురవిలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆల యంలో ప్రత్యేక పూజల అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు సీఐకి తీర్థప్రసాదాలు అందించి వేదాశ్వీరచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర గండ్రాతి సతీష్ పాల్గొన్నారు.




