calender_icon.png 6 December, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ పథకాలు

06-12-2025 12:00:00 AM

-కాంగ్రెస్ అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించాలి

-అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదు

-తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ రూరల్, డిసెంబర్ 5: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్దె ధ్యేయంగా ముందుకు పోతుందని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయన తిప్పర్తి మండల కేంద్రంలో, జొన్నలగడ్డ గూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారoలో పాల్గొని మాట్లాడారు తిప్పర్తి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం రజిత-సుధీర్, జొన్నలగడ్డ గూడెం సర్పంచ్ అభ్యర్థి నామిరెడ్డి అనురాధ- వెంకట్రాంరెడ్డిలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్థామన్నారు గత 10 ఏండ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పేద ప్రజలకు ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. బతుకమ్మ చీరల పేరిట 60 రూపాయల నాసిరకం చీరలను మహిళలకు ఇచ్చిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, తిప్పర్తి మాజీ సర్పంచ్ లు మోష, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజి, ఎల్లయ్య, ఇండ్లూరు సర్పంచ్ అభ్యర్థి పాప కంటి సైదులు, సర్వారం సర్పంచ్ అభ్యర్థి మర్రి నరసయ్య, శిలార్మియా గూడెం సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీనివాస్, జంగి రెడ్డిగూడెం సర్పంచ్ అభ్యర్థి దాసరి జానయ్య, తాందార్ పల్లి సర్పంచ్ అభ్యర్థి కారే శ్రీరాములు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు