06-12-2025 12:00:00 AM
బెజ్జంకి డిసెంబర్ 5: ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిఐ శ్రీను సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని సత్యార్జున గార్డెన్ యందు ఎస్త్స్ర సౌజన్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ని బంధనలపై అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీను హాజరై మాట్లాడారు.గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ప్రశాంతమైన వా తావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
అనుమతి లే కుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. డబ్బు,మద్యం పంపిణీపై ప్రత్యేక ని ఘా ఏర్పాటు చేశామని.. అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట పరమన చర్యలు తప్పవని సూచించారు.సమస్య ఆత్మక గ్రామాలను శాంతియుత గ్రామాలుగా తీర్చిదిద్దేల ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు కృషి చేయాలని సూచించారు. ఎంపీడీవో ప్రవీణ్ ఎన్నికల అధికారులు అభ్యర్థులు హాజరయ్యారు.