calender_icon.png 6 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి గెలుపునకు పునాది

06-12-2025 12:00:00 AM

  1. ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి చాలా రవి 

పిల్లలు ఆట పాటలు శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి 

శేరిలింగంపల్లి, డిసెంబర్ 5(విజయక్రాంతి): ఓటమి గెలుపుకు పునాదని ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి చాలా రవి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు వివిధ ప్రభుత్వ ప్రవేట్ స్కూల్లో ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చుట్టుపక్కల స్కూల్ విద్యార్థుల తో రెండు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైన్స్ రంగంలో వివిధ అంశాలపై నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీ తదితర అంశాలపై విద్యార్థులు పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.

విద్యార్థులు నిరంతరం తమ చదువులో పరిసర ప్రాంతాలలో కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలని అవగాహన పెంచుకున్నప్పుడే మరింత ముందుకు వెళ్తారని ఆయన తెలిపారు. అబ్దుల్ కలాం భగత్ సింగ్ సుందరయ్య లాంటి ఎంతోమంది ఈ దేశ బాలల భవిష్యత్తు కోసం శ్రమించి అనేక కలలు కన్నారని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ షేర్ లింగంపల్లి ఎం ఈ ఓ వెంకటయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ప్రభాకర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు సభ్యులు సాంబశివరావు , ప్రజా సంఘాల నాయకులు శోభన్, కృష్ణ విజ్ఞాన కేంద్రం సిబ్బంది అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.