calender_icon.png 15 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయి

15-11-2025 12:00:00 AM

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కారణం సంక్షేమ పథకాలేనని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అనాజ్ పూర్‌లో  నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి, ప్రజలకు మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం సంక్షేమ పథకాలేనన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి కాలం చెల్లిందని.. బీజేపీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.  

మణికొండలో..

మణికొండ, నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో మణికొండలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక నాయకులు డప్పు అర్జున్ ఆధ్వర్యంలో మణికొండ మర్రిచెట్టు కూడలి వద్ద విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని, నవీన్ యాదవ్ గెలుపుపై శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  రామకృష్ణ రెడ్డి, డప్పు కళ్యాణ్ చిరంజీవి, ఏర్పుల కుమార్ సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

శంకర్ పల్లి చౌరస్తా లో..

శంకర్ పల్లి,నవంబర్ 14( విజయ క్రాంతి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో శంకర్ పల్లి చౌరస్తా  లో ఎమ్మెల్యే కాలె యాదయ్య  ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ  జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమం లో శంకర్పల్లి  మార్కెట్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్ర మెహన్, సీనియర్ నాయకులు సాత ప్రవీణ్ కుమార్, ఏనుగు రవీందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు ప్రశాంత్, సర్తాజ్, నాయకులు రాజేష్ గౌడ్,రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్ ముదిరాజ్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.