14-11-2025 11:44:40 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి నేడు పట్టణంలోని శాంతినగర్ లో సిబ్బందితో కలిసి మార్నింగ్ చేశారు. వార్డు నెంబర్ 28 లోని సానిటేషన్, పార్కులను, ప్రజలకు త్రాగునీటి సమస్య సరఫరా ఎలా అందుతోందని సమయానికి త్రాగునీరు వస్తుందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. శాంతినగర్ లో పలు హోటళ్లను తనిఖీ చేశారు. విజయోగదారులకు నాణ్యమైన సూచికమైన అల్పాహారం భోజనం ఇవ్వాలని యజమానులను ఆదేశించారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్ కుమార్, వెంకటయ్య, ఆర్ ఐ రాములు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.