calender_icon.png 15 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుమేహంపై అవగాహన కార్యక్రమం

15-11-2025 12:00:00 AM

  1. గురునానక్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డయాబెటిస్ వాక్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మదుమేహంపై అవగాహన కోసం ‘డయాబెటిస్ వాక్’ 

నిర్వహించిన గురునానక్ కేర్ హాస్పిటల్స్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గురునానక్ కేర్ హాస్పిటల్స్ డయాబెటిస్‌పై అవగాహన కల్పించడానికి ‘డయాబెటిస్ వాక్’ ను నిర్వహించింది. ముందుగానే గుర్తించడం, జీవ నశైలిలో మార్పులు చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం. గురునానక్ కేర్ హాస్పిటల్స్ వద్ద ప్రారంభమైన అవగాహన ప్రదర్శన ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కొనసాగి అక్కడి నుంచి తిరిగి ఆస్పత్రి ప్రాంగణం వద్ద ముగిసింది.

జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేఎస్ మి యోనుద్దీన్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ రీజినల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ జి. సూర్య ప్రకాష్, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కందుల, జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, అలాగే గురునానక్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ భారతి జెట్టి ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు.

మధుమేహంపై కమ్యూనిటీ స్థాయిలో అవగాహన పెరిగితే వ్యాధి భారాన్ని తగ్గించవచ్చనే సందేశాన్ని బలంగా చాటుతూ, సీనియర్ వైద్యు లు, ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు ఉత్సాహం గా పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేఎస్ మియోనుద్దీన్ మాట్లాడుతూ ముందస్తు స్క్రీనింగ్, రెగ్యులర్‌గా చెక్‌అప్స్ చాలా అవసరమన్నారు. సకా లంలో రోగనిర్ధారణతో పాటు, ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలిప్రతి రోజు నడవడం, తినే ఆహారాన్ని నియంత్రించడం, ప్రా సెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండడం, సరైన నిద్ర అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.

సరైన సమాచారం, సకాలంలో చర్య తీసుకుంటే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు అన్నారు. సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కందుల మాట్లాడుతూ మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్సను క్రమంగా కొనసాగిస్తే జీవన నాణ్యత తగ్గాల్సిన అవసరం లేదు అన్నారు. ఈరోజు మా సందేశం ఒకటే.. నివారణ, సకాలంలో గుర్తింపు, క్రమం తప్పని నియంత్రణ, ఇవే ఆరోగ్యం కాపాడే ప్రధాన మార్గాలు అని అన్నారు.

గురునానక్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ భారతి జెట్టి మాట్లాడుతూ, జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంలో అవగాహన చాలా ముఖ్యమైన ఆయుధం అని అన్నారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే గుర్తించి జాగ్రత్తపడటం ఎంత ముఖ్యమో స్పష్టం చేశారు.