29 April, 2026 | 11:55 AM

బెంగాల్‌ ఎన్నికలు: తొలి రెండు గంటల్లో 18.39 శాతం పోలింగ్

29-04-2026 10:32 AM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది దశలో భాగంగా 142 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో మొదటి రెండు గంటల్లోనే మొత్తం 3.21 కోట్ల మంది ఓటర్లలో 18.39 శాతం(Bengal Assembly Election Polling Percentage) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 20.86 శాతం పోలింగ్ నమోదైందని, ఆ తర్వాతి స్థానంలో 20.16 శాతంతో హుగ్లీ నిలిచిందని తెలిపారు.

నదియాలో 18.5 శాతం పోలింగ్ నమోదైందని, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర 24 పరగణాలు (17.81 శాతం), కోల్‌కతా ఉత్తర (17.28 శాతం), దక్షిణ 24 పరగణాలు (17.25 శాతం), కోల్‌కతా దక్షిణ (16.81 శాతం) నిలిచాయని వివరించారు. రాష్ట్రానికి రాజకీయ, ఎన్నికల పరంగా కీలక కేంద్రాలుగా నిలిచే కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వెలుపల ఓటర్లు బారులు తీరగా, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.  హింసాత్మక ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు.