అక్రమ నిర్మాణాలపై చర్యలేవి ?
- అధికారుల అండదండలే కారణమా?
- ఇంత జరుగుతున్నా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
- కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం?
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు.. పట్టించుకోని యంత్రాంగం
ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ముషీరాబా ద్ నియోజకవర్గంలోని(Mushiraba Constituency) పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ప ట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణాలకు అనుమతులు, సెట్బ్యాక్లు, పార్కింగ్, ఫైర్ సేఫ్టీ వ ంటి నిబంధనలను పాటించకుండా కొందరు నిర్మాణదారు లు, కాంట్రాక్టర్లు పనులు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్ మె ట్, ముషీరాబాద్, కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్ డివిజ న్ లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్య వహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల ప ర్యవేక్షణ లోపంతోనే నిర్మాణదారులు తమ ఇష్టారాజ్యంగా ప నులు కొనసాగిస్తున్నారని ప్రజలు అంటున్నారు. నిర్మాణ ప నులు ప్రారంభించే ముందు అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కొందరు వాటిని పట్టించుకోకుండా పనులు చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు గాలికి..
కొన్ని ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, ప్రజలకు అ ందుబాటులో ఉండాల్సిన ప్రదేశాలను సైతం ఆక్రమిస్తూ ని ర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణదారులకు మరింత ధైర్యం వస్తోందని పేర్కొంటున్నారు.
అధికారుల కనుసన్నల్లో?
నిర్మాణ పనులపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు కాంట్రా క్టర్లు అధికారుల అండదండలతోనే నిబంధనలను ఉల్లంఘి స్తూ పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా..న్నాయి. వీటిపై అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
ఫిర్యాదులు చేసినా స్పందన కరువు
అక్రమ నిర్మాణాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయేందుకు టౌన్ప్లానింగ్ విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా లేదా అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర పరిశీలన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






