వారికేం తెలుసు కార్మిక చట్టం ఒకటుందని!
01-05-2026 12:00 AM
బండలను పిండి చేస్తూ
డ్యాంలను, రోడ్లను,
ఇండ్లను నిర్మిస్తున్న
కార్మిక లోకానికి
ఏమి తెలుసు
కార్మిక చట్టాల పని తీరు?
చంటి పిల్లకి పాలు సైతం
ఇవ్వకుండా పనిలోనే
నిమగ్నమైన కన్నతల్లికి
ఏమి తెలుసు
కార్మిక చట్టం ఒకటుందని...
ఒళ్లంతా హూనమయ్యేలా
ఒంగి ఒంగి పనులు చేసినా
పూట గడవని పరిస్థితి..
పాపం కార్మిక వేతన చట్టం
ఒకటుందని వారికేమీ తెలుసు
కలం పట్టుకొని కార్మికుల, కర్షకుల
బాధలను గాథలను ప్రభుత్వాలకు
తెలియజేస్తున్న కలం
కార్మికుడికి కూడా వర్తించని
కార్మిక చట్టాలు
మరి ఎవరికి చుట్టాలు
అయ్యాయి మన కార్మిక చట్టాలు
ఉన్నవాడి చేతిలో బందీలుగా
మారి కాగితాలకే పరిమితమైనవి...
టి.సురేందర్, 9440715635






