29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

కొత్త చట్టాలపై మీ వైఖరేంటి?

23-07-2024 12:48 AM
  1. అవి ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నాయి
  2. నియంతృత్వపూరిత సెక్షన్లను వ్యతిరేకించాలి
  3. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయచట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం బహిరంగ లేఖలో పేర్కొంటూ వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయచట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఈ చట్టంలోని పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ పోరాటాల గడ్డ ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే స్వభావమున్న నేల అని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉక్కు పిడికిళ్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయన్నారు. అలాంటి తెలంగాణలో ఇటీవల కేంద్రం తెచ్చిన చట్టాలతో అలజడి రేగుతోందని రాష్ట్రప్రభుత్వం స్పందించాలని కోరారు.