ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైంది
నిర్మల్‌లో మహాధర్నా
నిర్మల్ ,ఆగస్టు 27 ( విజయ క్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యోగ ఐకాసా నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. జేఏసీ పిలుపు మేరకు గురువారం నిర్మల్ మున్సిపల్ ముందు ధర్నా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై పలువురు ఉద్యోగ సంఘ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇంతకాలం వేచి చూశామని తెలిపారు.
అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే మహాధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే రెండో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2004 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ లింగన్న, భూమన్న యాదవ్, పి గంగారెడ్డి, జుట్టు గజేందర్, పూట నర్సయ్య బస్సుయుద్దీన్ రవికాంత్ ఇతరులున్నారు






