18 August, 2026 | 1:15 AM

అంతా రివర్స్ అయితే..?

18-08-2026 12:13 AM

శ్రీరామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి, డాక్టర్ కరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సోమవారం రివర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్‌లో నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. హీరో భ్రమపడుతున్నాడని ఇతరులు అనుకున్నవి నిజంగా భ్రమలేనా?, లేక హీరో బలంగా నమ్మినట్లు వాస్తవాలా? ఈ సంది గ్ధ పరిస్థితులకు కారణం ఎవరు? వంటి అంశాలు టీజర్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. టీజర్‌లో చివరి సీన్ తప్ప మొత్తం రివర్స్‌లో ఉండటం.. ఈ చిత్ర దర్శక నిర్మాతలు తొలిసారి చేసిన ఒక సరికొత్త ప్రయత్నంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి డీవోపీ: శివ కృష్ణ; సంగీతం: శ్రావణ్ భరద్వాజ్; ఎడిటర్: సత్య గిడుతూరి; ఆర్ట్: రాజు అడ్డాల.