9 August, 2026 | 4:26 AM

ఊడల మర్రిపై పట్టింపేది?

20-06-2024 02:21 AM

కోహీర్, జూన్ 19: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గొడిగార్‌పల్లి శివారులోని పెద్దవాగు పాజెక్టు పరివాహక ప్రాంతంలోని వందల ఏళ్ల వయస్సున్న ఊడల మర్రి మహావృక్షం నిరాదరణకు గురవుతున్నది. గొడిగార్‌పల్లి పంచాయతీ పరిధిలోని సిద్ధాపూర్ గ్రామం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పెద్దవాగు పక్కనే ఉండేది. చెరువు నిర్మాణంతో గ్రామాన్ని  ప్రస్తుతమున్న ప్రాంతానికి తలించారు. అక్కడే నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని మాత్రం తరలించలేదు. ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మహా వృక్షమై నిలిచింది. మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆలయం కూలిపోగా స్వామివారి విగ్రహం చెట్టు నీడనే ఉంటున్నది.

మహా వృక్షాన్ని కాపాడుకోవడంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2009 సంవత్సరంలో  ప్రభుత్వ భూమిలో ఐదెకరాలను కేటాయించారు. ఆలయ అభివృద్ధి కూడా చేపటాల్టని నిర్ణయించారు. జహీరాబాద్ రోడ్డు నుంచి చెట్టు వరకు రోడ్డును నిర్మించారు. 2014 సంవత్సరంలో కోహీర్ తహసీల్దార్ మహావృక్షం కేంద్రంగా పెద్దవాగు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖకు ప్రతిపాదనలు పంపించారు. దశాబ్దం పూర్తునా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ప్రస్తుతం అవగాహన లేని స్థానిక గిరిజనులు పక్కనే ఉన్న తమ పొలాల్లోకి చెట్టు విస్తరిస్తుందమో అని కొమ్మలను నరికివేస్తున్నా రు. కొమ్మలపైన ఉన్న తేనె తుట్టెలను కొట్టడానికి చెట్టు కింద మంటలు పెడుతున్నారు. దీంతో చెట్టు కొమ్మలు వాడిపోతున్నాయి. కొందరు వంట చెరకు కోసం కొమ్మలను నరుకుతున్నారు.