కోనేరు కమిటీ సిఫారసులలో లేనిది?

02-05-2024 12:05:00 AM

1. సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్న భారత పురావస్తు శాఖ  డైరెక్టర్ జనరరల్ ఎవరు?

1. కె.ఎన్.దీక్షిత్ 2. సి.మానస్

3. సర్ జాన్ మార్షల్ 4. ఎం.ఎస్. వాట్స్

2. సింధు నాగరికతకు సంబంధించి కింద ఇవ్వబడిన సరిహద్దు  మరియు ప్రాంతాన్ని జతపరచండి.

ఎ. ఉత్తర సరిహద్దు 1. మాండా (జమ్మూ కాశ్మీర్)

బి. పశ్చిమ సరిహద్దు 2. దైమాబాద్ ( మహారాష్ట్ర)

సి. తూర్పు సరిహద్దు 3. ఆలంగీర్‌పూర్ (ఉత్తరప్రదేశ్)

డి. దక్షిణ సరిహద్దు 4.సూత్కజెందార్ (బెలూచిస్తాన్ రాష్ట్రం

1.ఎ బి సి డి    2.ఎ బి సి డి

3. ఎ బి సి   4.ఎ బి సి డి

3. కింద ఇవ్వబడిన సింధు నాగరికతకు సంబంధించిన రచయిత  మరియు గ్రంథం గూర్చి సరికాని దానిని గుర్తించండి.

    రచయిత     గ్రంథం

1. మార్టిమర్ వీలర్ సింధు నాగరికత

2. వాల్టర్ ఫేర్ సర్వీస్ ప్రాచీన భారతదేశం మూలాలు

3. స్టువర్ట్ పిగాట్ చరిత్ర పూర్వ భారతదేశం

4. రేమాండ్ అండ్ ఆల్చిన్ మొహంజొదారో

4. చన్హుదారో ప్రదేశాన్ని ఎవరు ఎప్పుడు త్రవ్వకం జరిపి కనుగొన్నారు?

1. ఆర్.డి.బెనర్జీ 1992         2. ఆర్.సి.మజుందార్ 1931

3. సర్ ఆరెల్ స్టెయిన్ 1927    4. క్యూరే 1935

5. బన్వాలి అనే ప్రదేశం ఏ నది ఒడ్డున కలదు

1. సరస్వతి నది 2. సట్లెజ్ నది

3. బ్రహ్మపుత్ర నది 4. రావి నది

6. సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాలు, వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపరచండి.

ఎ. చన్హుదారో 1. ఎన్.జి.మజుందార్

బి. మొహంజొదారో 2. ఆర్.డి. బెనార్జి

సి. సూత్కజెందార్ 3. అరల్‌స్టీన్

డి. కాళిబంగన్ 4. డాక్టర్ ఘోష్ బి.బి.లాల్

1. ఎ బి సి డి   2. ఎ బి సి డి

3. ఎ బి సి డి.   4. ఎ బి సి డి

7. సింధు నాగరికతకు సంబంధించి ఏ ప్రాంతంలో చదరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి?

1.లోథాల్ 2. ఆలంగీర్‌పూర్

3. ధోలవీర 4. రోపార్

8. కింది వాటిని పరిశీలించండి.

   ప్రాంతం            విశేషం

ఎ. చన్హుదారో ఏనుగు విగ్రహం, నటరాజ విగ్రహం

బి. కాళిబంగన్ అమ్మతల్లి విగ్రహం

సి. బనవాలీ పులిబొమ్మ ముద్రిక

డి. కోట్‌డిజి కంచు కడియం

పైన ఇవ్వబడిన వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

9. క్రింది అంశాలను పరిశీలించండి.

ఎ. నవీన యుగంలో కుండలపై బొమ్మలను వేయడం మానవుడు

    నేర్చుకున్నారు.

బి. గోర్డాన్ చైల్డ్ అనే పండితుడు రాసిన what happend in      

    history అనే గ్రంథంలో నవీన యుగాన్ని నాగరిక 

    విప్లవం అని  పేర్కొన్నాడు.

సి. నవీన శిలాయుగంలో ప్రపంచంలోనే మొదటిసారి ప్రజలు

    పత్తిని పండించారు.

పైన ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి 

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

 1. ఎ మురియు బి 2. ఎ మాత్రమే

3. బి మరియు సి 4. ఎ, బి మరియు సి

10. క్రింది అంశాలను పరిశీలించండి.

ఎ. సింధు ప్రజల ముఖ్య దేవుడు పశుపతి

బి. సింధు ప్రజల బొమ్మల లిపిని అనుసరించారు

సి. హరప్పా ప్రజలు గ్రిడ్ విధానం పాటించారు.

పైన ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి 

సరైన సమాధానం ఎన్నుకోండి.

1. ఎ మరియు బి 2. ఎ, బి మరియు సి

3. ఎ మరియు సి 4. ఏవీకావు

11. కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన  సమాధానం ఎన్నుకోండి.

ఎ. అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు మరియు జనసాంద్రత    

     కలిగిన నగరం మొహంజొదారో

బి. సింధు ప్రజల వ్యాపారం మోసపొటోమియాలో 

    బహ్రైన్ ద్వీపం  ద్వారా జరిగింది.

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. ఎ మరియు బి 4. ఏవీకావు

12. కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి.

ఎ. లోథాల్ ప్రాంతాన్ని మినీ హరప్పా, మినీ మొహంజొదారో     

    నాగరికత అని అంటారు.

బి. ప్రపంచంలోనే లోథాల్ మొట్టమొదటి టైడల్ పోర్టు

 సి. ముత్యపుచిప్పల, గవ్వలు, ఇటుక పరిశ్రమలు కలవు

డి. వీధి వైపు గుమ్మాలున్న ఏకైక నగరం లోథాల్

1. ఎ మరియు సి 2. బి, సి మరియు డి

3. ఎ, బి మరియు సి 4. ఎ, బి, సి మరియు డి

13. కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి.

ఎ. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం వరి,

     పత్తి పంటలను పండించేవారు.

బి. సింధు ప్రజలకు తెలియని పంట చెరుకు

సి. సమాజంలో ఉన్నత స్థానం పొందిన 

    సామాజిక వర్గం తాపీ మేస్త్రీలు

1. ఎ, బి మరియు సి 2. బి, సి మరియు డి

3. ఎ, సి మరియు డి 4. ఎ, బి, సి మరియు డి

14. కింది సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబును ఎన్నుకోండి.

ఎ. సింధు ప్రజలు ఆరాధించిన పశుపతి దేవుడికి కుడి పక్క 

    ఏనుగు, పులి. ఎడమ పక్కన ఖడ్గమృగం, వృషభం. 

    పీటం కింద కాళ్ల వద్ద రెండు జింకలు కలవు

బి. సింధు ప్రజలు కొలిచిన పక్షి కాకి

సి. సింధు ప్రజలు కొలిచిన వృక్షాలు రావి, మర్రి చెట్లు

1. ఎ మరియు సి 2. బి మరియు సి

3. ఎ మరియు బి 4. ఎ, బి మరియు సి

15. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత ?

1. కంచు యుగం 2. నవీన యుగం

3. రాగి యుగం 4. తామ్ర యుగం

16. కింది సమాచారాన్ని పరిశీలించి  సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

ఎ. హరప్పా ప్రజలు తమ నగరీకరణలో గ్రిడ్ విధానం పాటించారు

బి. మొహంజొదారో ప్రాంతాన్ని నిఖిలిస్తాన్ అని అంటారు

సి. కోట రక్షణ గోడలు లేని ఏకైక నగరం చన్హుదారో

డి. సింధు ప్రజల కుటీర ప్రరిశ్రమల్లో 

    విస్తృతమైనది ఇటుకల తయారీ

1. ఎ, బి మరియు సి 2. బి, సి మరియు డి

3. ఎ, సి మరియు డి 4. ఎ, బి, సి మరియు డి

17. హరప్పా నాగరికత క్షీణతకు కింది వాటిలో ఏది కారణ ?

ఎ. నదులు ఎండిపోవడం  బి. అటవీ నిర్మూలన

1. ఎ మరియు బి     2. ఎ కాని బి కాదు

3. ఎ మాత్రమే     4. బి మాత్రమే

18. సింధు నాగరికతకు సంబంధించి కింది అంశాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

1. వ్యవసాయం కోసం నాగలి ఈ నాగరికతలో కనుగొనబడింది

2. పరిణతి చెందిన సింధు లోయ నాగరికత కాలంలో 

   రాఖీ గర్హి  ఓడరేవు నగరం

3. ఇతర సింధులోయ నగరాల మాదిరిగా కాకుండా ధోలవీ

    మూడు భాగాలుగా విభజించబడింది.

4. కాళీబంగన్ మరియు లోథాల్‌లో త్యాగాలు చేయడానికి అగ్ని

    పీఠాలు ఉన్నాయి.

19. సింధు నాగరికతకు సంబంధించి కింది అంశాలను  పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

ఎ. సింధు నాగరికత ఉద్యానవనము 

    (గార్డెన్ ఆఫ్ ఇండస్ వాలీ సివిలైజేషన్)

బి. థోల్‌వీర నగరం అష్టముఖ దుర్గాలతో 

    మూడు భాగాలుగా విభజింపబడింది

సి. చన్హుదారో నగరం మూడుసార్లు వరదలకు గురైంది

డి. కాళీబంగన్ నగరంలో నాగేటి చాళ్లు మరియు లిపి కుడి నుంచి

    ఎడమకు వ్రాసిన ధాఖలాలు ఉన్నాయి.

1. ఎ, బి మరియు డి 2. ఎ, బి, మరియు సి

3. బి, సి మరియు డి 4. ఎ, బి, సి మరియు డి

20. క్రింది సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబు ఎన్నుకోండి. 

ఎ. సింధు ప్రజలు అంత్యక్రియలు రెండు రకాలుగా చేసేవారు

బి. సామాజిక జీవనంలో సింధు ప్రజలు మూడు రకాలుగా  

    ఉండేవారు. అవి పురోహితులు, యుద్ధ వీరులు మరియు 

    చేతివృత్తి వారు

1. ఎ మాత్రమే 2. బి మాత్రమే

3. ఎ మరియు బి 3. ఏవీకావు

21. ఈ క్రింది వానిలో సరికానిది ?

1. ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశముల చట్టం  1968

2. ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణ (నిరోధక) చట్టం  1982

3. అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం  1977

4. రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు  1999

22. కోనేరు రంగారావు కమిటీ దీనిపై నియమించెను?

1. పన్ను సంస్కరణలు 2. నూతన వ్యవసాయ విధానం

3. భూ సంస్కరణలు 4. వ్యయ సంస్కరణలు

23. భూ సంస్కరణలకు సంబంధించి కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫారసుల సంఖ్య?

1. 10 విభాగాలలో 204   2. 12 విభాగాలలో 104

3. 12 విభాగాలలో 204   4. 10 విభాగాలలో 104

24. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులలో లేనిది?

1. రాష్ట్రంలో పంపిణీకి అనువైన భూములు 14 పైగా ఉన్నవి

2. భూమిలేని ప్రతి రైతుకు 1 ఎకరం చొప్పున పంపిణీ చేసేంత

    భూమి ప్రభుత్వం వద్ద కలదు

3. భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ ఉండాలి

4. అసైన్డ్ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్నవారికి 

   ఆ భూమిని ఇచ్చివేయాలి

25. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులలో ఎక్కువ సిఫారసులు దీనికి చెందినవి?

1. దేవాలయ భూములు   2.  అసైన్డ్ భూములు

3. గిరిజనులు                4. కౌలు సంబంధ అంశాలు

26. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల ప్రకారం భూమిలేని పేదవారు అనగా?

1. భూమిలేనివారు  2. ఒక ఎకరం మాగాణి కన్నా ఎక్కువ లేనివారు

3. రెండెకరాల మెట్ట కన్నా ఎక్కువ లేనివారు 4. పైవారందరూ

27.అసైన్డ్ భూములకు సంబంధించి నేరు రంగారావు కమిటీ సిఫారసులలో గల అంశము?

1. అసైన్డ్ భూముల ప్రతిపాదన గ్రామసభ ఆమోదించాలి

2. అసైన్డ్ భూమిని కొన్నవారి నుండి వారు పొందిన 

   ఆదాయానికి రెండు రెట్లు రుసుము వసూలు చేయాలి

3. మండల కేంద్రానికి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రభుత్వ 

   భూములను ప్రొహిబిటేటివ్ ఆర్డర్ పుస్తకంలో 

   నమోదు చేయాలి

4.పైవన్నీ

28. దేవాలయ భూములకు సంబంధించి కోనేరు రంగారావు కమిటీ సిఫారసులలో గల అంశము

1. దేవాలయ భూముల కౌలు పరిమితిని 

   6 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించాలి

2. పేదలు కాని వారి ఆధీనంలో ఉన్న దేవాలయ 

   భూముల నుంచి వారిని తొలగించాలి

3. ప్రతీ దేవాలయానికి ఉన్న భూముల వివరాలను 

   సమగ్రంగా నమోదు చేయాలి

4. పైవన్నీ

౨౯. ఆదివాసీ గిరిజన సమస్యలపై కోనేరు సిఫారసులలో లేనది

1. కోర్టులు, ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయుట 

   నిరాకరిస్తే ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు

2. గిరిజనేతరుల లిఖిత సాక్ష్యం కంటే గిరిజనుల 

   మౌఖిక సాక్ష్యానికే ప్రాధాన్యమివ్వాలి

3. గిరిజనేతరులను గిరిజనుల భూముల నుండి తొలగించాలి

4. గిరిజనేతరుల పేరున ఉన్న స్థిరాస్తులను 

   వారిపేరున రిజిస్ట్రేషన్ చేయాలి

జవాబులు