22-11-2025 01:38:08 AM
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో 26 లక్షల మంది జనాభా ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ రంగంలో అ న్యాయం జరుగుతున్నదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జనాభాకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో అధిక అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ--డీ నుంచి బీసీ--ఏ జాబితాలోకి ముదిరాజ్‌లను మార్చాలని కోరారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ ఆధ్వర్యం లో దుగ్గొండి మండలంలో నిర్వహించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 13 మత్స్య సహకార సొసైటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని గిర్నిబావి నుంచి దుగ్గొండి వర కు నిర్వహించారు.
దుగ్గొండి మండలంలో పలు గ్రామాల నుంచి వందలాది మంది మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థులు మత్స్యకార దినోత్సవంలో పాల్గొన్నారు. ఉద యం నుంచి పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు జరిగాయి. గిర్నిబావి వద్ద ఒక్కచోట చేరిన వందలాది వాహనాలపై నినాదాలతో భారీ ర్యాలీగా మండల కేంద్రానికి చేరుకున్నారు. ముదిరాజ్ మహాసభ జెండాను ఎగరవేసిన అనంతరం నిర్వ హించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడారు.
తెలంగాణలో దా దాపు 26 లక్షల మంది ఉన్న ముదిరాజ్ జ నాభా బలానికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో తమకు అధిక అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీ--డీ ఉపవర్గంలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ--ఏ జాబి తాలో చేర్చి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. రుణమాఫీ చేసి, చేపల విత్త నాలు సకాలంలో సరఫరా చేయాలని, రిజర్వాయర్లలో స్థానిక సొసైటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి ఆర్థిక హామీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్ పల్లెబోయిన అశోక్ డిమాండ్ చేశారు.
మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేయాలి
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్‌ఆర్‌ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్‌కుమార్ మాట్లాడాతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు ముదిరాజ్‌లు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల జీవన ఉపాధి పునరుద్ధరణకు పునరావస చర్యలు చేపట్టాలన్నారు. నష్టంపై జిల్లా అధికారుల నిష్పక్షపాత వ్యవహరించాలన్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిల్వాలని కోరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్థులు పార్టీలకతీతంగా జాతి ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అవకాశాల్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో మనమెంతో.. మనకు అంతా అనే నినాదాన్ని నిజం చేయడానికి నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండాలని పొన్నం మొగిలి ముదిరాజ్ పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. 13 మత్స్య సహకార సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, వేలాది మంది మత్స్యకారులు ఈ ఐక్యతా ప్రదర్శనలో పాల్గొన్నారు. చెరువుల ఆక్రమణతో ముదిరాజులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.
నిరుద్యోగులైన ముదిరాజ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా నాయకులు గిన్నె భాస్కర్, నేదురు రాజేందర్, వరంగంటి తిరుపతి, దండు చిరంజీవి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు, ఈర్ల నరేష్, గొర్రె రామకృష్ణ వరంగాంటి కుమారస్వామి, మంద బిక్షపతి, దండు నరసయ్య, మంద యువరాజు, కీసరి రాకేష్, ఈర్ల రమేష్, కోలువుల సాంబయ్య, తౌటి రవి, మరి వివిధ గ్రామాల నుంచి కుల పెద్దలు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.