7 May, 2026 | 4:50 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

ఏది ఆచరణ యోగ్యం?

22-05-2024 12:00 AM

దృష్టి పూతం న్యసేత్ పాదం, 

వస్త్ర పూతం జలం పివేత్,

శాస్త్ర పూతం వదేద్ వాక్యం, 

మనః పూతం సమాచరేత్!

 చాణక్య నీతి

“ముందుకు అడుగు వేసేప్పుడు బాగా పరికించి చూసి మరీ అడుగు వేయాలి. నీరు తాగేప్పుడు బట్టతో బాగా వడగట్టి శుభ్రమైన నీటినే తాగాలి. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి శాస్త్ర సమ్మ తమైన విధానంలోనే మాట్లాడాలి. కార్యాచరణలో మనసు చెప్పిన విధంగా, మన సుకు నచ్చిన విధంగానే పనులు శ్రద్ధతో ఏకాగ్రతతో ఆచరించాలి” అంటాడు చాణక్యుడు.  

‘వ్యక్తి జీవితం సార్థకత పొందాలంటే జీవితంలో ఏదైనా సాధించాలి. నిస్సారమైన బతుకుతో ప్రయోజనమేమీ లేదు. ఏ కార్యమైనా నిర్వహించాలంటే ముం దు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే సమగ్రమైన కార్య స్వరూ పం అవగతమైతే అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. చాలా సులువైన పని, మన నుండి కాదని విడిచి పెట్టడం. కాని, దానిని తుది దాకా నిర్వహించుకోవడంలోనే వ్యక్తి మానసిక బలం, చైత న్యం నిరూపితమవుతుంది. కాబట్టి, కార్యరంగంలోకి అడుగు వేయాలంటే ఆ కార్య స్వరూప స్వభావాలపై స్పష్టత రావాలి. అందుకే, ముందు వెనుకలు ఆలోచించి, ఆ కార్య నిర్వహణలో తుది ఫలితం ఏమి టో దర్శించిన పిమ్మటనే ముందడుగు వేయమంటున్నాడు ఆచార్య చాణక్యుడు.   

‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం’ అన్నారు పెద్దలు. శరీరంలో దాదాపు 70% నీరున్నా అవసరమైన పరిమాణంలో తీసుకోవడం వల్ల మాత్రమే మన జీవనయాత్ర కొనసాగుతుంది. అయితే, నీరు తాగడం కూడా ఒక కళే. స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. నీటిని వడగట్టడం వల్ల స్వచ్ఛతను సంతరించుకుం టుంది. ప్రాచీన భారతీయ సమాజంలో బట్టను లేదా చీరను 6 నుండి 8 మడతలుగా చేసి నీటిని వడగట్టేవారు. ఇది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే లో అత్యుత్తమమైన విధానంగా నిరూపితమైంది. కాబట్టి, వడపోసిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి. 

అదగక ముందే ఇవ్వాలి

మాట్లాడడం ఒక కళ. అది స్వతహాగా రాకున్నా కష్టపడైనా అభ్యసించి అలవా టు చేసుకోవాలి. తుపాకీ గుండు ఎలాగైతే బయటికి వస్తే వెనక్కి తీసుకోలేమో అలాగే మాటనూ వెనక్కి తీసుకోలేం. శాస్త్రం శాసిస్తుంది, ఏది మాట్లాడేందుకు యోగ్యమైందో, ఏది అయోగ్యమైందో. మాటలతోనే సామ్రాజ్యాలను గెలువవచ్చు లేదా కోల్పోనూ వచ్చు. ఒకసారి నాలుకతో దంతాలు అన్నాయట, “మేము తలచుకుంటే నిన్ను నలిపేయగల”మని. నవ్వుతూ నాలుక అన్నదట, “నేను ఒక్కమాట మాట్లాడితే మీరు 32 మందీ రాలిపోతా”రని. మాటకున్న శక్తి అలాంటిది. అందుకే, విచారించి శాస్త్ర సమ్మతమైన మాటలను మృదువుగా, తగిన అంతరాలలో, మార్దవంగా మాట్లాడేవారికి విజయసాధన కరతలామలకం.

పరధర్మం పనికి రాదు

మనసు చెప్పినట్లుగా ఆచరణ ఉండా లి. మన ఆంతఃచేతనకు భిన్నంగా ప్రవర్తిస్తే అలజడికి గురవుతాం. అలజడి ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడివల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. దాం తో కార్య స్వరూపాన్ని సరిగ్గా అంచనా వేయలేం. అందువల్ల ప్రణాళికలో లోపం ఏర్పడి ఆచరణ తప్పుతుంది. కార్య భంగం అవుతుంది. మరి, అంతఃచేతనకు ప్రాతిపదిక ఏది? సామాజిక ప్రయోజనం. మనకు, ఎదుటివారికి ఆనందం కలగడం. ప్రలోభాలకు లొంగి పని చేయడం లేదా భయపడి పని చేయడం వల్ల మనసును ఆ కార్యంపై వంద శాతం లగ్నం చేయలేం. అలా చేయడం పరధర్మంగా చెప్పబడుతుంది. మన అంతః చేతన సూచిత మార్గంలో వెళ్ళడం స్వధర్మంగా చెప్పబడుతుంది. గీతలో చెప్పిన విధంగా పరధర్మం ఎప్పుడూ భయావహమే. ఇలా పైన పేర్కొన్న చిన్న శ్లోకం ద్వారా అనల్పమైన జీవితసత్యాన్ని ఆవిష్కరించారు ఆచార్య చాణక్యులు.

పాలకుర్తి రామమూర్తి