17 April, 2026 | 11:54 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పాక్ అనుకూల వైఖరి దేనికి సంకేతం

31-05-2025 02:37 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
  2. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ చేతిలో ఎన్ని రాఫెల్ విమానాలు కూలాయనే విషయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతమని బీజేపీ ఓబీసీ మోర్చాజాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైనవని తేల్చారు.

ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం అత్యంత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. సైన్యం మనోభావాలను గాయపర్చడమే కాకుండా.. మన దేశాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైన వెల్లగక్కుతున్నారని వాపోయారు.

పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతమని నిలదీశారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని, ఈ అంశంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలంతా రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. రాఫెలే కాదు యుద్ధంలో ఒక్క విమానం కూడా కూలిపోలేదని స్పష్టం చేశారు.