calender_icon.png 12 September, 2024 | 11:49 PM

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల మర్మమేంటి..?

10-07-2024 05:41:55 AM

గ్యారెంటీ లేని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు

పక్షం రోజుల్లో రానున్న రెగ్యులర్ ఉద్యోగులు

ప్రస్తుత ఫ్యాకల్టీని తొలగించడంపై విమర్శలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 9 (విజయక్రాంతి): జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గెస్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు సంబం ధిత అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురుకుల పాఠశాల, కళాశాలల్లో సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియా మకపత్రాలను సైతం అందజేసింది. రేపో మాపో టీజీటీ, పీటీజీ, జేల్‌తోపాటు ఇతర సిబ్బందికి కేటాయించిన విద్యాసంస్థలకు వెళ్లనున్నారు. 317 జీవోలో భాగంగా పలువురు జిల్లాకు వచ్చారు.

రెగ్యులర్ సిబ్బంది వస్తే సంబంధిత గెస్ట్ ఫ్యాక్టల్లీ స్వచ్ఛందంగా విధులు వదిలి వెళ్లిపోవాల్సిందే. అయినప్పటికీ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే గెస్టు ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 16 మందిని తొలగించి కొత్తగా గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో అభ్యర్థులకు డెమో సైతం నిర్వహించారు. పర్మనెంట్ ఉపాధ్యాయులు వ చ్చేవరకు ప్రస్తుతం విధుల్లో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీలనే కొనసాగించాలని గెస్ట్ టీచర్స్ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అభ్యర్థులకు ముగిసిన డెమో...

జిల్లాలోని సిర్పూర్(టి) బాలుర గురుకులంలో ఇంగ్గిష్ (జేఎల్), సోషల్ (పీజీటీ), బాలికల గురుకులంలో హిస్టరీ(జెల్), ఇంగ్లిష్ (పీటీజీ, టీజీటీ), మ్యాథ్స్(టీజీటీ), కాగజ్‌నగర్‌లో బోటనీ, ఫిజిక్స్ (జేఎల్), మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్(పీజీటీ), ఇంగ్లిష్ (టీజీటీ), రెబ్బెనలో బయోసైన్స్(పీజీటీ), మ్యాథ్స్(టీజీటీ), ఆసిఫాబాద్‌లో తెలు గు, బోటనీ(జేఎల్) ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ (టీజీటీ) పోస్టులకు సంబంధించి మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో అభ్యర్థులకు డెమో నిర్వహించారు.