14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

డకాయిట్ కొత్త షెడ్యూల్

08-06-2025 12:00 AM

అడివి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘డకాయిట్. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టుటైలిష్ విజువల్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబధించిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.

మరోవైపు టీమ్ జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది.