calender_icon.png 8 June, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కడ టాటూ ఏమైనట్టు?

08-06-2025 12:00:00 AM

తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా స్టార్‌డమ్ అందుకున్న సమంత టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ఆమె ఇప్పుడు నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలిచిత్రం ‘శుభం’ మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు సమంత తెలుగుతోపాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తోంది.

ఇటీవల సమంత నటించిన ‘సిటాడెల్’ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది. త్వరలోనే సమంత హీరోయిన్‌గానూ బిజీ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబందించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత మెడపై టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అక్కడ టాటూ కనిపించకపోవడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమతున్నాయి.

సమంత టాటూ తొలగించిందని కొంతమంది.. లేదు మేకప్‌తో కవర్ చేసిందని మరికొంత మంది అంటున్నారు. సమంత మెడపై వైఎంసీ అనే టాటూ ఉంటుంది. తన  మొదటి సినిమా ఏమాయ చేసావె గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు. అయితే ఈ వైఎంసీ టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది సమంత.

ఇప్పుడు టాటూ కనిపించక పోవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ‘రక్త్‌బ్రహ్మాండ్’ అనే సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌కు రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె ఇంకా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలోనూ నటిస్తోంది.