17 May, 2026 | 4:00 AM

ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు

15-02-2025 12:00 AM

‘గదర్ 2’ క్లుమైక్స్ విషయంలో దర్శకుడు అనిల్ శర్మ, నటి అమీషా పటేల్ మధ్య వివాదం నెలకొంది. ఈ సినిమా ‘గదర్ ఏక్ ప్రేమ్‌కథ’కు సీక్వెల్‌గా రూపొందింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందింది. ఈ చిత్రంలో సన్నీడియోల్ , అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గతేడాది విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా క్లుమైక్స్‌ను తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా దర్శకుడు మార్చేశాడనేది అమీషా అభియోగం. ఈ సినిమాలో అమీషా పటేల్ సకీనా అనే పాత్రలో నటించింది. తొలుత అయితే క్లుమైక్స్‌లో విలన్ పాత్రను సకీనా చంపుతుందని దర్శకుడు రాసుకున్నాడట. అది ఆమెకెంతో నచ్చిందట. కానీ తరువాత విలన్ పాత్రను వేరొకరు చంపేలా కథను మార్చేశారట. ఆ విషయం షూట్ జరిగే వరకూ తనకు కూడా తెలియదని అమీషా అన్నారు. అమీషా వ్యాఖ్యలు వైరల్ అవడంతో దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. అమీషా వ్యాఖ్యల్లో నిజం లేదంటూ కొట్టిపడేశారు. అయితే తాజాగా అనిల్ శర్మ తీరును తప్పుబడుతూ అమీషా పటేల్.. స్టోరీ నరేషన్ సమయంలో తీసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అనిల్ శర్మ ఏం సమాధానం చెబుతారని అమీషా ప్రశ్నించారు.