పది సెకన్లలో మీకేం తెలుస్తుంది?
సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక మనుషులను అంచనా వేసే విధానమే మారిపోతోంది. వ్యక్తి మంచివాడా? లేదంటే చెడ్డవాడా? అనేది ఈ సోషల్ మీడియా ఆధారంగానే అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఖుషీ కపూర్ తాజాగా నెటిజన్లకు ఓ సూచన చేసింది. 10 సెకన్ల ఇన్‌స్టా రీల్ చూసి మనుషులను అంచనా వేయవద్దని తెలిపింది.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తన చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ఏఐ కారణంగా జరుగుతున్న భయంకరమైన ఘటనలను ఇంటర్నెట్‌లో చూస్తున్నాం. దీనిపై అందరూ అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండాలి. ఏఐను మంచికి మాత్రమే వినియోగించుకోవాలి. నిజజీవితంలో కమ్యూనికేషన్ ముఖ్యం.
నిత్యం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. ఇన్‌స్టాలో కంటెంట్ క్రియేటర్స్ విషయమై ఫాలోవర్స్ ఓ నిర్ణయానికి వస్తారు. కేవలం 10 సెకన్ల రీల్ చూసి ఆ వ్యక్తిపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం ఏంటో తెలియట్లేదు.
అసలు ఆ పది సెకన్లలో ఆ వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? మీకు వారి జీవితం గురించి కానీ.. వాళ్లేం చేస్తారనే విషయం కానీ తెలియదు. అలాంటప్పుడు వారిని ఎలా అంచనా వేస్తారు?” అని ఖుషీ ప్రశ్నించింది.






